calender_icon.png 19 February, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే సీసీఐ కొనుగోళ్లు

15-02-2025 07:52:10 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయాని రైతులెవరు ఆందోళన చెందవద్దని  సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు(Sirpur MLA Dr. Palvai Harish Babu) శనివారం సూచించారు. గత వారం రోజులుగా రైల్ టెల్ సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశ వ్యాప్తంగా సిసిఐలో పత్తి కొనుగోళ్లు నిలిచిన విషయం విదితమే. సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతులకు కాటన్ కార్పొరేషన్ అధికారులు(Cotton Corporation officials) అండగా ఉంటారని తెలిపారు.