కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లు రెండు రోజుల పా టు నిలిపివేస్తున్నట్టు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య తెలిపా రు. శని, ఆదివారం రైతులు పత్తిని తేవొద్దని ఆమె సూచించారు. ప్రభు త్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రెండు రోజుల బంద్ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి తిరిగి కొంటామని చెప్పారు.