* సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆందోళన
* వికారాబాద్ ప్రధాన రోడ్డుపై వాహనాలు పెట్టి నిరసన
వికారాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): వికారాబాద్‌లోని సీసీఐ కేంద్రాల్లో సకాలంలో పత్తి కొనుగోలు చేయడం లేదం సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వర కాటన్‌మిల్లుకు రెండుమూడు రోజులుగా పెద్ద పత్తి విక్రయానికి వచ్చింది.
అక్కడ సకాలంలో పత్తి కొనుగోలు చేయకపోవడంతో.. అధికారులను అడిగినా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో రైతులు పత్తి వాహనాలతో వికారాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్డుపై వాహనాలను అడ్డం నిలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌జాం అయ్యింది.
అధికారులు పత్తి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చేంత వరకు వాహనాలు తీసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అనంతరం మార్కెటింగ్ అధికారులు రైతులతో మాట్లాడి పత్తిని కొను చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.