calender_icon.png 21 January, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్వరి జిన్నింగ్ మిల్లు యాజమాన్యం తీరును నిరసిస్తూ పత్తి రైతుల ఆందోళన

21-01-2025 02:31:23 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తాండూర్ మండలంలోని రేపల్లెవాడలో గల మహేశ్వరి కాటన్ జిన్నింగ్ మిల్లు యాజమాన్యం తీరును నిరసిస్తూ మంగళవారం పత్తి రైతులు జిన్నింగ్ మిల్లు ఎదుట గల జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. జిన్నింగ్ మిల్లు యాజమాన్యం పూర్తిగా దళారులకు కొమ్ముగాస్తుందని రైతులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. గత మూడు రోజుల కిందట వచ్చిన పత్తి బండ్లను ఇప్పటివరకు అనుమతించకుండా దళారుల పత్తిని కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పత్తి రైతుల ఆందోళన కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.