* పెట్టుబడికి నాలుగింతలు ఇస్తామని ప్రచారం
* ఆన్‌లైన్ యాప్‌కు ఆకర్షితులై రూ.లక్షల్లో పోగొట్టుకున్న అమాయకులు
జనగామ, జనవరి 18 (విజయక్రాంతి): కోస్టా యాప్‌లో పెట్టుబడి పెడితే మూడు నాలు ఎక్కువ పైసలిస్తామంటూ రూ.కోట్లు కొల్లగొట్టిన విషయం జనగామ జిల్లాలో వెలుగు చూసింది. మోసపోయామని గ్రహించిన సుమారు 50 మంది బాధితులు శనివారం జనగామ పోలీస్‌స్టేషన్ మె ఎక్కారు. జనగామ ఏసీపీ నితిన్ చేతన్ పాందేరీ వివరాలు తెలుసుకున్నారు.
కొన్ని నెలలుగా కోస్టా యాప్‌లో పెట్టుబడులు పెడుతూ వస్తున్న వారికి ఒక్కసారిగా ఆ యా ఆగిపోవడంతో గుండె ఆగినంత పనైంది. అప్పటికే లక్షల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఎందరో ఉన్నారు.
గత నెలలో భారీ ఈవెంట్..
కోస్టా యాప్ గురించి వివరించేందుకు జనగామకు చెందిన కొందరు వ్యక్తులు గత డిసెంబర్ నెలలో జనగామ జిల్లాలోని ఓ పెద్ద ఫంక్షన్ హాల్‌లో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది హాజరైనట్లు సమాచారం. వీరికి యాప్ ప్రతినిధులు కోస్టా యాప్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు ఉంటాయని వివ తక్కువ పెట్టుబడితో లక్షాధికారు అవుతారని నమ్మించారు.
దీనికి ఆకర్షితులైన కొందరు ఈ యాప్‌ను వినియో మొదట్లో కొంచెం రిటర్న్స్ రావడంతో ఆ విషయాన్ని మరికొందరికి చెప్పారు. ఇలా ఒకరి నుంచి ఒకరికి విషయం పా ఇంకేముంది వేలాది మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. మొదట్లో కొంచె రిటర్న్స్ ఇవ్వడంతో యాప్‌ను పూర్తిగా నమ్మిన కొందరు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు.
ఇలా కోట్లాది రూపాయలు యాప్‌లో జమ అయ్యాక సంక్రాంతి పండుగకు ముందు యాప్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఖంగుతిన్న బాధితులు మోసపోయినట్లు గ్రహించారు. ఒక్కొక్కరు రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఈ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్నట్లు సమాచారం. జనగామ జిల్లాలో దాదాపు 5 వేలకు పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
మోసపోయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, టీచర్లు, పలువురు అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో ఆరువేల మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జనగామలో గత నెల కోస్టా యాప్ గురించి ఈవెంట్ నిర్వహించిన శ్రీధర్‌యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.