- మన ఆలయాల గొప్పతనానికి గుర్తుగా తయారీ
- కాస్మిక్ ఫ్యుజన్ రూపశిల్పి మధుసూదన్ కొడాలి
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాం తి): దేశంలోని గొప్ప చరిత్రను తిరిగి ప్రపంచానికి తెలియజేసేందుకు కాస్మిక్ ఫ్యుజన్‌ను రూపొందించినట్టు దాని రూపకర్త మధుసూదన్ కొడాలి తెలిపారు. సోమవారం ఆయన ‘విజయక్రాంతి’తో మాట్లాడుతూ.. మన చరిత్ర, సంస్కృతిని కాపాడేందుకు దేశంలోని 27 ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన శిలలతో కాస్మిక్ ఫ్యుజన్‌ను రూపొందించినట్టు వివరించారు.
ఆలంపూ ర్ శక్తిపీఠం నుంచి కొండగట్టు అంజన్న గుడి వరకు శిలలను సేకరించి ఓ విలువైన కళాఖండంగా రూపొందించినట్టు తెలిపారు. కాణిపాకం, అన్నవరం, బాసర, కనకదుర్గ, మేడారం, రామప్ప, లేపాక్షి, వేములవాడ, పిఠాపురం, ఒంటిమి ట్ట, తిరుమల, శ్రీశైలం, సింహాచలం, శ్రీకాళహస్తి, నెల్లూరు రంగనాథస్వామి, అం తరే ్వది, ద్వారకా తిరుమల, ఆలంపూర్, ద్రాక్షారామం, వెయ్యి స్థంభాల గుడి, యాదగిరిగుట్ట, అరసవెల్లి, భద్రకాళి, అహోబిలం, చిల్కూరు బాలాజీ, భద్రాచలం దేవాలయాలను నిర్మించిన అత్యంత పురాతన శిలలను సేకరించి ఈ కళా ఖండాన్ని రూపొందించినట్టు వెల్లడించారు.
27గుడులకు సంబంధించిన శిలలను ప్రత్యేకంగా ఓ గాజు పలకలో అమర్చినట్టు వివరించారు. కాస్మిక్ ఫ్యుజన్‌ను చూసి తెలంగాణ, ఏపీ దేవాదాయశాఖ మంత్రులు కొండా సురేఖ, ఆనం రాంనారాయణరెడ్డి సైతం అభినందించినట్టు తెలిపారు. వేల ఏళ్ల క్రితంనాటి మన చరిత్ర, సంస్కృతిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించేందు కు ఈ కాస్మిక్ ఫ్యుజన్‌ను రూపొందించినట్లు చెప్పారు.
దేవున్ని నమ్మే వారికి అ న్ని దేవాలయాల్లో ఉన్న శక్తి మొత్తాన్ని ఈ కాస్మిక్ ఫ్యుజన్ ద్వారా అందించేందుకు చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. కాస్మిక్ ఫ్యుజన్ కావా లనుకున్నవారు https://thecosmicfusion.comలో సంప్రదించాలని మధుసూదన్ కోరారు.