బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌గౌడ్
హైదరాబాద్, జూలై18 (విజయక్రాంతి): అత్యంత తక్కువ సమ యంలో అత్యంత ఎక్కువగా అవినీతి, అక్రమాలకు పాల్పడింది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ విమర్శించారు. అన్ని శాఖల్లో మంత్రులు పదేళ్ల దాహాన్ని తీర్చుకునేలా అవినీతికి పాల్పడుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్వయంగా ‘ఆర్’ ట్యాక్స్‌తో అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ ఎస్ ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. వానలతో చెరువులు నింండుతున్నా చెరువుల్లో చేప పిల్లల పంపిణీని ఇంతవరకు ప్రారంభించలేదన్నారు.