19-03-2025 12:54:57 AM
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి..
హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు, కమర్షియల్ ట్యాక్స్, ఆబ్కారీ వంటి శాఖల్లో లంచం లేనిదే పని జరగడం లేదన్నారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అవినీతి అడ్డకట్ట వేయాలని లేఖలో సూచించారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో లేకుండా పోయిందని పేర్కొన్నారు. అవినీతిని అరికట్టడానికి ఏర్పాటు చేసిన విజిలెన్స్, ఏసీబీ రిపోర్టులపై రాష్ర్ట సచివాలయంలో తగు చర్యలు తీసుకోవడం లేదని విన్నవించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగస్థులకు పోస్టింగులు, ప్రమోషన్‌లు ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.