calender_icon.png 14 November, 2024 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి జిల్లాలో ‘అవినీతి’ బాగోతం

13-11-2024 12:09:37 AM

  1. వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న అధికారులు
  2. అయినా మారని తీరు
  3. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ 

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 1౨ (విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు ప్రభుత్వ అధికారులు పాలనను మరిచి ప్రతి పనికి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తు న్నాయి. ప్రత్యేక జిల్లా ఏర్పాటయ్యాక ఇదం తా జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.

పైసలిస్తేగానీ ఫైళ్లు కదలని కార్యాల యాలు, మరోవైపు ప్రభుత్వ, దేవాదాయ భూముల ఆక్రమణ, అక్రమ కట్టడాలు, నిర్మించే భవనాల్లో నిబంధనలకు తూట్లు, ఇలా  ప్రతి దానికి అధికారుల వైఫల్యమే కారణమని సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. కలెక్టరేట్‌లోనూ అధికారులు యథేచ్ఛగా లంచాలు తీసుకుంటున్నారు.

ఇటీవల జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ  ఓ రైతు వద్ద డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీకి రూ.1.14 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అదేవిధంగా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ అనుమతి కోసం మున్సిపల్ రెవెన్యూ విభాగంలో సిబ్బంది రూ.30వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు.

ఆళ్లపల్లి ఎంపీఓ, విద్యుత్ మీటరు ఏర్పాటుకు రూ.23వేలు లంచం తీసుకుంటూ లైన్‌మెన్ నాగరాజు, తాజాగా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లలో ఇంటి నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి  పుల్లయ్య రూ.18వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డారు. ఇలా శాఖ ఏదైనా, పనికి పర్సంటేజీలు ముట్టజెప్పాల్సిందేనని స్పష్టమవుతున్నది.

ఏశాఖలో నైనా డబ్బులున్నోడికి, రాజకీయ పలుకుబడి ఉన్న వారి పను లు అవుతాయని, సామాన్యుడికి న్యాయం జరగదనే సంకేతాలు ప్రజల్లోకి  బలంగా వెళ్తున్నది. ఇప్పటికైనా కలెక్టర్  జిల్లాలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని లేకపోతే సా మాన్యులు ఇబ్బందులకు గురికాక తప్పదని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.