calender_icon.png 22 February, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి అడ్డా.. ఎక్సైజ్ ఆఫీస్!

22-02-2025 12:00:00 AM

  1. జోరుగా కల్తీ కల్లు అమ్మకాలు.. 
  2. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు 
  3. రికార్డుల్లో ఈత చెట్లు క్షేత్రస్థాయిలో కనిపించవు...
  4. ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలకు ప్రతినెల భారీగా మామూళ్లు...?
  5. కల్తీ కల్లు అమ్మకాలపై ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఎకై ్సజ్ శాఖ

సంగారెడ్డి, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): ఎక్సైజ్ కార్యాలయాలు అవినీతికి అడ్డగా మారిపోయాయని ఆరోపణలు వస్తున్నా యి. కల్తీ కల్లు నివారించేందుకు ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాల్సింది పోయి... కల్లు వ్యాపారులతో కలిసి సిండికేట్ దందా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  రికార్డుల్లోని ఈత చెట్లు ఉంటున్నాయి.. క్షేత్ర స్థాయిలో ఎక్కడ కూడా ఈత చెట్లు కనిపిం చడం లేదు.

ఎక్సైజ్ అధికారులు కల్లుగీత కార్మికులకు లైసెన్సులు జారీ చేస్తారు. లైసెన్సు ఉన్నవారు ఈత చెట్ల నుంచి కల్లు గీసి అమ్ముకోవాల్సి ఉంటుంది. మరికొన్ని గ్రామాలను సొసైటీలు ఏర్పాటు చేసుకుని కల్లు అమ్మకాలు చేస్తారు. కల్లు కాంట్రాక్టర్ లు ఎక్సైజ్ అధికారులతో కలిసి వ్యాపారం చేయడంతో కల్తీకల్లు అమ్మకాలు పెరిగిపో యాయని ఆరోపణలు వస్తున్నాయి.

సంగా రెడ్డి జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, నారా యణఖేడ్, ఆందోల్, పటాన్ చెరులో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి. సీఐ స్థాయి అధికారి స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా పనిచే స్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ముగ్గురు, నలుగురు ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పనిచేస్తుంటారు.

ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ లు కల్లు వ్యాపారులతో కుమ్మక్కై కల్తీ కల్లు నివా రించడం లేదని ఆరోపణలున్నాయి. పెద్దలు వ్యాపారులతో కలిసి ఎక్సైజ్ అధికారులు వ్యాపారం చేయడంతో కల్తీ కల్లు నివారించడం లేదని విమర్శలు ఉన్నాయి. 

కల్తీ కల్లు అమ్మకాలు నివారించడంలో విఫలం..?

ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ప్రభు త్వం సొసైటీలు ఏర్పాటు చేసుకొని కల్లు అమ్మకాలు చేసుకునేందుకు లైసె న్సులు ఇస్తుంది. గీత కార్మికులు ఈత చెట్ల నుంచి కల్లు గీసుకొని అమ్మకాలు చేసుకు నేందుకు వ్యక్తిగతంగా లైసెన్సులు ఇస్తుంది. ఎక్సైజ్ అధికారులు, పెద్ద కాంట్రాక్టర్లు కల్లు అమ్మకాలు చేసేందుకు ముందుకు రావ డంతో కల్తీ కల్లు అమ్మకాలు పెరిగిపోయా యని విమర్శలు ఉన్నాయి.

ప్రతి ఎక్సైజ్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ లు కల్లు వ్యాపా రులతో కలిసి ఉండడమే కాకుండా వారితో వ్యాపార భాగస్వాములుగా ఉంటున్నారని సమా చారం. కొందరు అధికారులు తమకు అను కూలంగా ఉన్న వ్యక్తులను కల్లు వ్యాపారులుగా రంగప్రవేశం చేసి వ్యక్తిగతం గా లైసెన్స్‌లో ఉన్న వారి ద్వారా కల్లు తయారు చేయిం చి అమ్మకాలు చేస్తున్నట్లు తెలిసింది.

కల్లు అమ్మకాలు చేసి వ్యాపారు లు ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్ ఎస్.హెచ్.ఓలకు టిఫిన్ చాయి నుంచి భోజ నం మందు ఏర్పాటు చేసి తమకు అనుకూ లంగా ఉంచు కుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రోజు వారికి కావలసిన భోజనాలు టిఫిన్లు మందు ఏర్పాటు చేయ డంతో పాటు వ్యాపారంలో భాగస్వామిగా ఉంచుకుంటు న్నారని తెలిసింది. 

ఎక్సైజ్ అధికారుల కనుసైగలోనే కల్తీ కల్లు అమ్మకాలు...?

సంగారెడ్డి జిల్లాలో ఈతవనాలు తగ్గిపోయిన కల్లు అమ్మకాలు తగ్గడం లేదు. ఈత చెట్లు లేకపోయినా కృతిమంగా మత్తు పదార్థాలతో కల్తీ కల్లు తయారుచేసి అమ్మ కాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈతవనాలు ఆందోల్ ప్రాంతంలో కొద్ది పాటిగా ఉన్నాయి. నారాయణఖేడ్, జహీరా బాద్, సంగారెడ్డి, పటాన్ చెరు ప్రాంతంలో లేవు.

ఈత చెట్లు లేకపోయినా కల్లు వ్యాపా రులు ప్రతిరోజు కల్తీ కల్లు తయారుచేసి అమ్మకాలు చేస్తున్నారు. కల్తీ కల్లు వ్యాపా రును యూరియా, క్లోరో ఫామ్, అల్పా జోలం వంటి మత్తు పదార్థాలు ఉపయోగి స్తున్నట్టు తెలిసింది. తీపితో పాటు కల్లు తాగిన వారికి మత్తు ఎక్కేందుకు అధిక మొత్తంలో మత్తు పదార్థాలు వినియోగిస్తు న్నారని తెలిసింది.

సంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు నివారించడంలో ఎక్సైజ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. కల్తీ కల్లు అమ్మకాలు చేస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు.

జిల్లాస్థాయి అధికారులకు సమాచారం ఇచ్చిన వారు ఎస్ హెచ్ ఓ లకు ముందుగా సమాచారం ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారని తెలిసింది. దాడులు చేసి కేసులు చేయవలసిన అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడడంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు.