వేములవాడ దేవస్థానంలో అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బందిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టు వార్తలు రావడం దురదృష్టకరం. దేవుని సన్నిధిలో వుం డికూడా ఇలాంటి పనులు చేయడానికి వారికి మనసెలా వచ్చిందో ఆ దేవునికే తెలియాలి. మొత్తం ౧౩ మంది అధికారులపై చర్యలు తీసుకున్నారంటే, అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కానీయరాదు. వివిధ ఆలయాలేకాక ప్రభుత్వ రంగం సిబ్బందికూడా దీనిని ఒక పాఠంగా తీసుకోవాలి.
ఎన్.సి.ప్రసాద్ చిలుకానగర్, హైదరాబాద్