calender_icon.png 31 March, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన ఆర్ఎంపై చర్యలు తీసుకోవాలి

28-03-2025 06:41:18 PM

ఎఐటియూసి ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసి డ్రైవర్ల నియామకాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఆర్ఎం సోలేమాన్ పై చర్యలు తీసుకోవాలని ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగులైన డ్రైవర్ లతో కలిసి శుక్రవారం డిపో ఎదుట ధర్నా నిర్వహించి డిఎం రాజ శేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్టీసి సంస్థ ఇటీవల ఔట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ ల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని అందుకుగానూ సుమారు 250 మందికి పైగా హైర్, ప్రయివేట్ డ్రైవర్ లు దరఖాస్తులు చేసుకున్నారని అయితే ఆర్ఎం సోలేమాన్ అక్రమాలకు పాల్పడుతూ కొంత మందికి మాత్రమే సమాచారం అందించి ఈ నెల 26 న నియామకాలు చేపట్టారని అన్నారు.ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్  నాయకులు మధుసూదన్,షాపిక్,బాలేష్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.