calender_icon.png 15 January, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నో అబ్జెక్షన్ పేరిట కరెప్షన్

07-12-2024 01:03:24 AM

  1. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వంత పాడుతున్న నీటిపారుదల శాఖ అధికారులు

క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ఎన్‌వోసీలు!

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో భారీగా వెలిసిన నిర్మాణాలు

వానాకాలంలో కాలనీలను ముంచెత్తుతున్న వరద

సంగారెడ్డి, డిసెంబర్ 5 (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ, ఈఈ కార్యాలయాలు కరెప్షన్‌కు కేరాఫ్‌గా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారయ్యింది పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు.. వెంచర్లు, భవనాలు నిర్మించే ముందు నీటిపారుదల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి.

అలాగే సాగులో ఉన్న భూమిలో నిర్మాణాలు చేసేందుకు  ఎన్‌వోసీ తీసుకోవాలి. అయితే పూర్తి పారదర్శక విచారణ అనంతరం ఇవ్వాల్సిన ఎన్‌వోసీలను ఇక్కడి నీటిపారుదల శాఖ డీఈఈలు, ఏఈలు.. డబ్బులకు ఆశపడి అడ్డగోలుగా ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాము అడిగినంత ఇస్తే.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మాణాలు చేపట్టినా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వరదనీటి కాల్వల (నాలాల) దారి మళ్లింపులు చేసేందుకు కూడా డబ్బు లు ఇస్తే అనుమతులు ఇచ్చేస్తున్నారు. నీటిపారుదల శాఖలో జరుగుతున్న ఎన్‌వోసీ అవినీతి పై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..

నీటిపారుదల శాఖలో ఎన్‌వోసీల పేరుతో భారీగా డబ్బులు వసూలు?

సంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పాటు అమీన్‌పూర్, గుమ్మడిదల, హత్నూరా, జిన్నారం, కంది, పటాన్‌చెరు, సంగారెడ్డి , రామచంద్రాపురం మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. జిల్లాలో నీటిపారుదల శాఖ పరిధిలో సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ ఖేడ్‌లో ఈఈ కార్యాలయలు ఉన్నాయి. సంగారెడ్డిలో ఎస్‌ఈ కార్యాలయం ఉంది. కొన్ని మండలాల్లో డీఈఈ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.

నీటిపారుదల శాఖ నుంచి రియల్ వ్యాపారులకు, బిల్డర్లకు ఎన్‌వోసీ ఇవ్వాలంటే ముందుగా ఏఈలు  క్షేత్రస్థాయిలో పరిశీలించి డీఈఈకి నివేదిక ఇవ్వాలి. కాని నీటిపాదల శాఖలో కొందరు అధికారులు ఏఈలకు సమాచారం ఇవ్వకుండానే నేరుగా ఎన్‌వోసీలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి.. ఎన్‌వోసీ తీసుకునేవారు నీటిపారుదల శాఖకు భూమికి సంబంధించిన పత్రాలు (పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్ డాక్యు మెంట్లు) అధికారులకు చూపించాలి.

గ్రామ పంచాయతీ, సంబంధిత అధికారుల సిఫారసు పత్రాలు, అవసరమైన మ్యాపు, సర్వే వివరాలు అందజేయాలి. ఎన్‌వోసీ ఎందుకోసం తీసుకుంటున్నారో చూపించాలి. ప్రకృతి వనరుల సంరక్షణతో పాటు వరదనీటి కాల్వలకు ఎక్కడా నష్టం జరగకుండాఅనుమతులు ఇవ్వాలి. 

పటాన్‌చెరులో భారీ డిమాండ్..

పటాన్‌చెరు సబ్ డివిజన్ హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం, అక్కడ జోరుగా వెం చర్లు, భవనాలు నిర్మాణం చేసేందుకు నీటిపారుదల శాఖ నుంచి ఎన్‌వోసీలు తీసుకో వడం జరుగుతుంది. దీంతో ఇక్కడి నీటిపారుదల శాఖలో డీఈ, ఏఈ పోస్టులకు భారీ డిమాండ్ ఉందని తెలిసింది. పటాన్‌చెరులో పనిచేసేందుకు వచ్చే వారు ముం దుగానే అధికారులకు, రాజకీయ నాయకులకు భారీగా మూడుపులు చెల్లించి వస్తున్న ట్లు తెలిసింది. కొందరు ఇక్కడ ఏఈలుగా పనిచేసి ప్రమోషన్ వచ్చిన వెంటనే కొన్నిరోజు లు ఇతర ప్రాంతల్లో పనిచేసి రాజకీయ పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చారని తెలిసింది.