08-04-2025 12:53:56 AM
స్టాంపు వేస్తే రూ.500
అవృద్ధి పేరుతో నిరుపేదలతో వసూళ్లు
కలెక్టర్ వసూళ్లు చేయమని చెప్పారంటూ బుకాయింపు
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 7 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (హెచ్ డిఎస్ ) పేరుతో ఒక్కో స్టాంపు ఖర్చు 500 చొప్పున నిరుపేదల నుండి ముక్కు పిండి వసూలు చేస్తు న్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఫిట్నెస్, మెడికల్ లీవ్, ఇన్సూరెన్స్ ఇతర సంతకాల స్టాంపు వేయడం కోసం సు మారు రోజుకు వేళల్లో వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆసుపత్రిలో రోగులకు వైద్యులకు ఇతర రోగి బంధువులకు సైతం ఎలాం టి వసతులు నోచుకోవడం లేదు.
మరుగుదొడ్లు మూత్రశాలలో వాటికోసం డోర్లు కూ డా సక్రమంగా లేకపోవడం విశేషం. ఇప్పటికీ వైద్యులు రాసే మందులు లేక ప్రైవేటు మెడికల్ దుకాణాలకు పరుగులు పెడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ నుండి ఆసుపత్రి అభివృద్ధి కోసం వచ్చిన కోట్ల నిధుల్లో గోల్మాల్ జరిగిందని పెద్ద ఎ త్తున ప్రచారం జరిగింది. అయినా ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడంతో స ర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ స్పత్రి డెవలప్మెంట్ సొసైటీ పేరుతో గత మూడేళ్లుగా సామాన్యుల నుండి వసూలు చేసిన నిధులు దేనికి ఖర్చు చేశారన్న అంశాలపై స్పష్టత లేకపోవడంతో పలు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏ ర్పాటు చేసినప్పటికీ అదనంగా ఆక్సిజన్ సి లిండర్ల కొనుగోలు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగు తోంది.
పరిమితికి మించి వినియోగించినట్లు కూడా లెక్కలు తారుమారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎండల వేడిమి దృష్ట్యా ఐసీ యూ ఇన్సెంటివ్ కేర్ వార్డులో కనీసం ఏసి కూలర్లు కూడా పనిచేయకపోవడంతో రోగు లు ఎండల వేడిమికి ఉక్కపోతకు గురవుతున్న పరిస్థితి. అయినా వాటి మరమ్మత్తు చేయకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.
రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి ఆసుపత్రి అభివృద్ధి కోసం 50 లక్షల నిధు లు మంజూరు చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో వాటిని దేనికి ఖర్చు చేశారన్న లెక్క లు ఇప్పటికే తేలేకపోవడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనరల్ ఆస్పత్రిలోని ఆయా వార్డుల్లో వినియోగించే యంత్రాల కొనుగోలు విషయంలోనూ భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. కరోనా తీవ్రత సమయంలో స్వ చ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన యంత్రాలు సైతం మాయమైనట్లు వి మర్శలు ఉన్నాయి.
కలెక్టరే వసూళ్లు చేయమన్నారు!
ఆస్పత్రి డెవలప్మెంట్ సొసైటీ పేరు తో గత కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకే జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రతి స్టాంపుకు 500 చొప్పున రోగులు వారి బంధువులు, సామాన్యుల నుండి వస్తువులు చేస్తున్నాం. అందు కు రసీదు కూడా ఇస్తు న్నాం. వసూలు చేసి న డబ్బులన్ని జిల్లా కలెక్టర్ వారికే పంపుతు న్నాం. వారి సూచనల మేరకే ఆసుపత్రి అభివృద్ధి చేస్తున్నాం. రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
డాక్టర్ రచ్చ రఘు, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి, నాగర్కర్నూల్.