calender_icon.png 24 November, 2024 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం నగరపాలక సంస్థలో అవినీతి?

05-11-2024 12:16:31 AM

  1. విజిలెన్స్ అధికారుల నిఘా!
  2. సిబ్బంది అక్రమాలపై విచారణ

ఖమ్మం, నవంబర్ 4 (విజయక్రాంతి): ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్న వేళ విజిలెన్స్ అధికారులు ప్రత్యేకించి నిఘా పెట్టినట్లు తెలుస్తోం ది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు పనుల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇటీవల కొంతమంది సిబ్బందిని వేరే ప్రాంతాలకు బదిలీ కూడా చేశారు. అయినా సిబ్బందిలో మార్పు రాకపోవడంతో విజిలెన్స్ నిఘా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పనులు, వాటిలో జరిగిన అవినీతి, అధికారులు, సిబ్బంది పాత్రపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

పట్టణ ప్రణాళిక విభా గం, ఇంజినీరింగ్ విభాగంపై ప్రత్యేకించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇటీవల కొంతమంది సిబ్బంది పనితీరుతో విసుగు చెందిన ఉన్నతాధికారులు వారి సెక్షన్లను కూడా మార్పు చేశారు. అయినా వారిపని తీరులో మార్పు రాలేదంటున్నారు. కలెక్టర్ కూడా సిబ్బందిని హెచ్చరించినా ప్రయోజనం లేకుండాపోయిందని తెలిసింది. 

ఇంజినీరింగ్, ప్రణాళికా విభాగాల్లో..

ఇంజినీరింగ్, ప్రణాళికా విభాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కూడా ఆరోపణలున్నాయి. గతంలో ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చి, రిజిస్ట్రేషన్లకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

అసిస్టెంట్ కమిషనర్‌పైనా కూడా ఆరోపణలు వస్తుండటంతో విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇతనిపై అక్కడ పని చేసే సిబ్బంది గుర్రుగా ఉండి, పై అధికారులకు సమాచారం అందిస్తున్నారని సమాచారం. అతి త్వరలోనే మరికొంత మంది అధికారులు, సిబ్బందిపైనా వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.