calender_icon.png 26 October, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు దవాఖానకు అవినీతి జ్వరం

18-09-2024 12:21:35 AM

  1. వస్తువుల కొనుగోలు పేర అక్రమాలు 
  2. వసతుల లేమితో రోగుల ఇబ్బందులు 
  3. ప్రైవేటు రిఫర్ చేస్తూ దండుకుంటున్న వైద్యులు?

నాగర్‌కర్నూల్ , సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అవినీతి రోగం పట్టుకుంది. పారిశుధ్య నిర్వహణ, మందులు, బెడ్లు, ఆక్సిజన్ ఇతర సామగ్రి కొనుగోళ్లలో చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నా యి. జిల్లాలో ఒక జనరల్ ఆసుపత్రి, రెండు ఏరియా ఆసుపత్రులు, రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 27 పీహెచ్‌సీలు, 124 పల్లె దవాఖానలున్నాయి. 

తేలని నిధుల ఖర్చు వివరాలు

జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో కలిపి ఇప్పటిదాకా 50,521 మంది రోగులకు ఆరోగ్య శ్రీ సేవలను అందించినట్లు అధికారులు లె క్కలు చూపుతున్నారు. అందుకు రాష్ట్ర ప్ర భుత్వం రూ.132 కోట్లు ఆయా ఆసుపత్రుల అభివృద్ధి కోసం విడుదలయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో 2,300 మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందించగా రూ.50 కోట్ల నిధులు విడుదల అయినట్లు తెలుస్తోంది. వీ టితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్ర త్యేకంగా సొంత నిధులను కూడా మంజూ రు చేశారు. వాటిని ఎక్కడ ఖర్చు చేశారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. 

అన్ని శాఖల్లో వసూల్ రాజాలు

జనరల్ ఆసుపత్రిలో పనిచేసే కింది స్థా యి సిబ్బంది నుంచి పైస్థాయి వరకు అన్ని శాఖల్లో అవినీతి వసూలు రాజ్యం ఏలుతు ంది. వీల్ చైర్, స్ట్రెచర్ సేవలందించే వారు రోగుల ముక్కుపిండి డబ్బులు వసూలు చే స్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రసవ వార్డులో ఈ వ్యవహారం మరింత శృతిమించుతుందని ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో అందరికీ వాటాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీకి సైతం వసూళ్లకు పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రోగులకు నాసిరకమైన భోజనం అందిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గత ఏడాది కాలంగా క్యాంటీన్ అద్దె డబ్బులు కూడా కొందరి అధికారుల సొంత ఖాతాల్లో జమ అవుతున్నట్లు తెలుస్తున్నది. రోగులకు అందించే ఆక్సిజన్ కొనుగోళ్ల లోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. 

పడకేసిన పారిశుద్ధ్యం

జిల్లా జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పడకేసిందిజ ముక్కుపుటలు అదిరే దుర్వాసనతో రోగులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాగునీటి సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులోని బెడ్లు, వాటిపై వేసే పరుపులు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తుంది. జనరల్ ఆసుపత్రిలో 150 బెడ్ల నుంచి 300లకు పెంచినా ఆ స్థాయిలో మం దులు అందుబాటులో లేవు. దీంతో ప్రైవేటు షాపుల్లోనే రోగులు కొంటున్నారు. 

సెక్యూరిటీ గార్డులదే పెత్తనం 

ఆసుపత్రికి వచ్చిన రోగుల నుంచి సెక్యూరిటీ గార్డులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు రోగుల బంధువులు విమర్శిస్తున్నారు. ఆసుపత్రి ప్రధాన గేటు నుంచి మొదలుకుని ఒక్కో వార్డు వరకు పంచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. 

అభివృద్ధి పనులు చేపడుతున్నాం

పారిశుద్ధ్యం విషయంలో రెండు ఏజెన్సీల మధ్య జరిగిన గొడవ కారణంగా కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. అందుకు పరిష్కార మార్గాన్ని వెతికే పనిలో ఉన్నాం. తాగునీరు, మురుగు కాల్వల వ్యవస్థను మెరుగుపరిచేందుకు పనులను ప్రారంభించాం. అవినీతి ఆరోపణలను ఎదురుకు ంటున్న సెక్యూరిటీగార్డుల స్థానంలో కొత్తవారిని తీసుకుంటాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి మరిన్ని నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. అ వి రాగానే మరింత అభివృద్ది చేస్తాం. 

 డాక్టర్ రచ్చ రఘు, 

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, 

నాగర్‌కర్నూల్

ప్రైవేటుకు వెళ్లండి..

ఆసుపత్రికి వచ్చిన రోగులను భయభ్రాం తులకు గురిచేసి, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలని వైద్యులు సిఫారసు చేస్తున్నట్టు తెలుస్తున్న ది. దీనికి ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి కాసులు అందుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రాత్రి వేళ్లలో ప్రమాదా లు జరిగి ఆసుపత్రికి వస్తే వైద్యులకు కాసుల పండుగ చేసుకుంటున్నారన్న విమర్శలున్నా యి. ఆ సమయంలో రోగుల బంధువులను మరింత భయభ్రాంతులకు గురిచేసి ప్రైవేటు వెళ్లేలా సూచనలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆసుపత్రిలో సిటీస్కాన్ యంత్రం అందుబాటులో ఉన్నా ఏడాదిగా వినియోగించకుండా ఇతర ప్రైవేట కేంద్రాలకు రోగులను పంపుతూ కమీషన్లు తీసుకు ంటున్నట్టు తెలుస్తున్నది.