calender_icon.png 16 January, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలోనే అవినీతి

01-09-2024 02:14:00 AM

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

హనుమకొండ, ఆగస్టు 31 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రాష్ట్ర ంలో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నప నేని నరేందర్ ఆరోపించారు. హనుమకొండలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శని వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ మంత్రు ల బృందం దేవాదులకు వచ్చి స్థానిక పరిస్థితులు అధ్యయనం చేయకుండానే చిల్లర మాటలు మాట్లాడారని విమర్శించారు.

దేవాదుల మొదటిదశ 2008లో ప్రారంభమైతే అంచనా వ్యయం రూ.4వేల కోట్ల నుం చి రూ.10 వేల కోట్లకు పెంచి కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఎలాంటి అవగాహన లేకుండా మంత్రుల పర్యటన సాగిందని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తియని, అధికారం కోసం దేనికైనా దిగుజారుతాడని మండిపడ్డారు. 90 శాతం దేవాదుల పను లు పూర్తి చేసిన కేసీఆర్‌ను డెకాయిట్ అని మాట్లాడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్ద డెకాయి ట్ అని విమర్శించారు. సమావేశంలో నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, జెడ్పీ మాజీ చైర్మన్ సుదీర్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.