ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్మేలా ఎత్తులు.. ఇదీ నిర్వాహకుల నిర్వాకం!
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. కేంద్రాల నిర్వాహకులు రైతులు తీసుకొచ్చిన వడ్లు తూకం వేయకుండా తాలు, తరుగు, తేమ శాతం ఎక్కువ ఉందని కొర్రీలు పెడుతూ ఐదారు రోజు లు కేంద్రాల్లో పడిగాపులు పడేలా చేస్తున్నారు.
దీంతో రోజుల తరబడి ధాన్యం వద్ద కాపలా ఉండలేక అన్నదాతలు తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. ప్రభు త్వం నిర్ణయించిన ధర ప్రకారం ‘గ్రేడ్ ఏ’ ధర రూ. 2,320 ఉండగా, సాధారణ రకం రూ. 2,300 ఉంది. కానీ, వ్యాపారులు దళారులను పెట్టుకుని రూ. 1,900 లకే కొను గోలు చేస్తున్నారు.
రైతుల వద్ద కొనుగోలు చేసిన వడ్లను మరుసటి రోజు అదే కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దర్జాగా అమ్మకాలు చేస్తున్నారు. కేంద్రా ల్లో తూకం వేసే నిర్వాహకులు కమిషన్లకు అలవాటుపడి క్వింటాల్‌కు రూ. 100 చొప్పన తీసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 7,139 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 4,496, ఐకేపీ కేంద్రాల ద్వారా 2,102, ఇతరుల ద్వారా 541 కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 4,598 కేంద్రాలు ప్రారంభించి ధాన్యం సేకరణ చేస్తున్నారు.
గత 10 రోజుల నుంచి కేంద్రాలకు ధాన్యాన్ని రైతులు పెద్దఎత్తున తీసుకువస్తున్నారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు అక్రమంగా సంపాదించుకునేందుకు నిర్వాహకులను మచ్చిక చేసు కుని తమకు సహకరించాలని ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు చేయకుండా వక్రబుద్ధి ప్రదర్శిస్తున్న నిర్వాహకులు అనేక కొర్రీలు పెడుతున్నారు.
ప్రభుత్వం తేమశాతం, రంగు మారిన వెంటనే తీసుకోవాలని ఆదేశించినా ఎందుకు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వరికి 17 శాతం తేమ ఉండాలి. వాతావరణం మార్పులతో 19 నుంచి 21 శాతం వరకు తేమ వస్తుంది. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా మిల్లర్లు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
అదే సన్నధాన్యం గుర్తింపు విషయంలో కేంద్రాల వద్ద నిర్వాహకులు అవకతవకలు చేస్తున్నట్లు, వారికి లంచాలు ఇస్తే కొలతలు వేయకుండా సన్నాలుగా గుర్తించి రూ. 500 బోనస్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు. ఖరీఫ్‌లో 60.39 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 145 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది.
ఇందులో 91.28 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. మొదటిసారిగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు గోడౌన్లను సిద్ధం చేసింది. అదే విధంగా సన్నవరి 36 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 88 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. వరి కొనుగోలు కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 20వేల కోట్లు కేటాయించింది.
అప్పల బాధ భరించలేక త్వరగా అమ్మకాలు
ప్రభుత్వం వానాకాలం పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంతో తాము వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చామ ని వారు త్వరగా చెల్లించాలని ఒత్తిడి చే యడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవే టు వ్యాపారులకు అమ్మాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. వ్యాపారు లకు అమ్మకాలకు చేస్తే రవాణా చార్జీ, కేంద్రాల వద్ద రోజుల తరబడి ఉంచటం, అమ్మి రెండు రోజులకే డబ్బులు ఇవ్వడంతో తక్కువ ధరకైనా అమ్ముతున్నామని వెల్లడించారు.