16-12-2024 07:19:44 PM
కూకట్ పల్లి (విజయక్రాంతి): ఫతేనగర్ డివిజన్ లో నెలకొన్న వివిధ సమస్యలపై సోమవారం జిహెచ్ఎంసి కమిషనర్ ను ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రధానంగా ప్రతి నగర్ డివిజన్ లో ఫ్లైఓవర్, శివాలయం వద్ద అండర్ బ్రిడ్జి అదేవిధంగా స్మశాన వాటికకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఫ్లైఓవర్ ఆర్ఓబి ప్రాంతాలను పరిశీలించి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇందిరాగాంధీ పురం నాలాలో కొట్టుకపోయి చనిపోయిన బాలుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేసే విధంగా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి, కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.