హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): లక్నో కార్పొరేషన్లో బెస్ట్ ప్రాక్టీసెస్ స్టడీ టూర్లో భాగంగా సోమవా రం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీఆధ్వర్యంలో కార్పొరేటర్లు అక్కడ పర్య టించారు. తొలుత లక్నో స్మార్ట్ సిటీ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి కమాండ్ కంట్రోల్ సెంటర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెం ట్ కమాండ్, సేఫ్ సిటీ కమాండ్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజెమెంట్ సెంటర్లను పరిశీలించారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని మర్యాద పూర్వకంగా కలిశారు. మరోవైపు డిప్యూటీ మేయర్ నేతృత్వంలో 62 మంది కార్పొరేట ర్లు షిల్లాంగ్ మావ్లినాంగ్ గ్రామాన్ని సందర్శించారు.