త్వరలో సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కు అందజేస్తాం
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయి న ప్రజలను ఆర్థికంగా ఆదుకోడానికి జీహెచ్‌ఎంసీకి చెందని కార్పొరేటర్ల ఒకనెల గౌరవ వేతనం సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నట్టు మేయ ర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. గురువారం మేయర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు అనేక మంది ప్రజలు నిరాశ్రాయులుగా మారారని.. వారందరికీ అండగా నిలిచేందుకు జీహెచ్‌ఎంసీలోని 150 మంది కార్పొరేటర్లు వారి ఒకనెల గౌరవ వేతనాన్ని విరాళంగా అందజేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు. త్వరలోనే ఆ (రూ. 10 రూ.12 లక్షలు) మొత్తాన్ని చెక్కు రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని మేయర్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలపుడు బాధితులకు అండ గా నిలవాల్సిన అవసరం మనందరి పై ఉందన్నారు. దాతలు ముందుకు వచ్చి పెద్దమొత్తంలో విరాళాలు అందించాలని మేయర్ కోరారు.