హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విజయలక్ష్మి మెజారిటీని నిరూపించుకోవాలని లేదా మేయర్ పదవికి మెజారిటీ లేనందున రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కూడా మేయర్ పోడియంను ముట్టడించారు. ఈ సమావేశంలో నగరాభివృద్ధిపై ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య మాటల తూటాలు పేలాయి. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు ప్లకార్డులు ప్రదర్శించుకుని సభలో గందరగోళం సృష్టించారు. రెండు గ్రూపులు ఒకరినొకరు కొట్టుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. చైర్మన్ హెచ్చరించినా పట్టించుకోకుండా కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.