18-03-2025 08:32:08 PM
ఆల్విన్ కాలనీ (విజయక్రాంతి): ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మంగళవారం పరిశీలించారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ నగర్ లోని అంగన్ వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.
రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే అంగన్ వాడి కేంద్రంలో హాజరు పట్టి సరిగ్గా నోట్ చేయడంలేదని, రోజువారి వచ్చే పిల్లలను హాజరుపట్టిలో పొందుపరచి, పిల్లలకు పౌష్టికాహారం, గుడ్డు ఇస్తూ చదువు చెప్పాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గుడ్ల శ్రీనివాస్, రవి, ధనుంజయ, మల్లేష్, బాలాజీ నాయక్, బాలు నాయక్, శ్రీనివాస్, రంజిత్, రమేష్, జానీ, ఖాజా, పద్మ, రేఖ, రైమ, ముంతాజ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.