కూకట్‌పల్లి,(వియజక్రాంతి): సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఉషా ముళ్ళపూడి రోడ్డులో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు ఇరువైపులా చివరి అందచుల వద్ద మట్టిని వేసి చదును చేయాలన్నారు. ఎప్పటికప్పుడు సీసీ రోడ్డును క్యూరింగ్ చేసి వీలైనంత త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాకుండా వాహనాల రాకపోకలకు సులభతరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసిఐ రాజీవ్, స్థానిక నాయకులు శివరాజ్‌గౌడ్, షౌకత్‌అలీ మున్నా, రాజిరెడ్డి, పోశెట్టిగౌడ్, నాగేశ్వరారవు తదితరులు పాల్గొన్నారు.