calender_icon.png 26 February, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కాశీ విశ్వనాథుడికి కార్పొరేటర్ ప్రత్యేక పూజలు..

26-02-2025 06:54:03 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ దంపతులు కాశి లోని విశ్వనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ దేవదేవుని దీవెనలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.