calender_icon.png 23 November, 2024 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివిజన్ సమస్యలు పరిష్కరించాలి

22-11-2024 09:55:54 PM

జోనల్ కమిషనర్‌కు కార్పొరేటర్ వినతి

ఎల్బీనగర్,(విజయక్రాంతి): కొత్తపేట డివిజన్‌లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్‌ కేశవ్‌ను కార్పొరేటర్ పవన్‌కుమార్ కోరారు. శుక్రవారం జోనల్ కార్యాలయంలో కమిషనర్‌తో కార్పొరేటర్ సమావేశమై, కొత్తపేట డివిజన్‌లో నెలకొన్న సమస్యలను వివరించారు. డివిజన్‌లోని ప్రతి కాలనీల్లో సీసీరోడ్లు వేయించాలని కోరారు. భరత్‌నగర్ ఫేస్  మారుతినగర్‌లోని శ్వేత గార్డెన్ ఎదురుగా రోడ్డు, ఓల్డ్ మారుతీనగర్‌లోని గురుమందిర్ రోడ్డు మొత్తం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు. ఆయా కాలనీల్లో సీసీరోడ్లు వేయించాలని కోరారు. కొత్తపేట డివిజన్‌లోని కొన్ని కాలనీల్లో వీధిదీపాలు లేవని, కొత్తగా లైట్లు వేయించాలని సూచించారు. ఆయా కాలనీల్లో సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ పవన్‌ కుమార్ కోరారు.