18-03-2025 09:04:52 PM
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కార్పొరేటర్ సుజాత నాయక్ ఫిర్యాదు...
ఎల్బీనగర్: హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ మంగళవారం అసెంబ్లీ లాబీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సీఎంకి వివరించి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. అనుచిత వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని కార్పొరేటర్ సుజాత నాయక్ కు హామీ ఇచ్చారు.