11-03-2025 08:58:57 PM
కార్పొరేటర్ లచ్చిరెడ్డి ఆగ్రహం...
యూపీహెచ్ సీ, బస్తీ దవాఖానల్లో తనిఖీ..
ఎల్బీనగర్: ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు డాక్టర్లు కాకుండా నర్సులు ఎలా వైద్యం చేస్తారని? బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎన్ రెడ్డి నగర్ లోని యూపీహెచ్ సీ, బస్తీ దవఖానాల్లో డ్యూటీ నర్సులే రోగులకు వైద్యం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సాహెబ్ నగర్ బస్తీ దవాఖాన, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) దవాఖానలో డ్యూటీ నర్సులే వైద్యం చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం దవాఖానల్లో కార్పొరేటర్ లచ్చిరెడ్డి తనిఖీ చేశారు.
హాస్పిటల్లో డాక్టర్ లేక రెండు నెలలు అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. హాస్పిటల్ కి వచ్చే రోగులకు డ్యూటీ నర్సులు వైద్యం ఎలా నిర్వహిస్తున్నారని? ప్రశ్నించారు. వెంటనే డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (DMHO), మెడికల్ ఆఫీసర్ (MO)తో మాట్లాడారు. త్వరలోనే డాక్టర్లను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు.