29-03-2025 10:44:48 PM
కూకట్ పల్లి (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తన కార్యాలయం వద్ద యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి శనివారం డివిజన్ లోని ముస్లిం సోదరులకు, ఆడపడుచులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. డివిజన్ లో ఉన్న ముస్లిం సోదరులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, పాండుగౌడ్, పోశెట్టిగౌడ్, మజర్ ఫారూఖ్, ఖలీమ్, బషీర్, నికత్ ఫాతిమా, జబీన్ తదితరులు పాల్గొన్నారు.