హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య బూతులతో విరుచుకుపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. క్రాంతి కాలనీకి చెందిన ఓ వ్యక్తి కాలనీలోని సమస్యలను సోషల్ మీడి యాలో పెట్టడంతో.. కార్పొరేటర్ సదరు వ్యక్తికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తూ దుర్భాషలాడాడు. బూతులు మాట్లాడొద్దని ఆ వ్యక్తి కోరినా కార్పొరేటర్ రెచ్చిపోయాడు. దీంతో కార్పొ రేటర్ తీరును నిరసిస్తూ చెంగిచెర్లలోని క్రాంతి కాలనీ రోడ్డు నంబర్ 4 కాలనీ వాసులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోడుప్పల్ మున్సిపాలిటీలోనే క్రాంతి కాలనీ పెద్దది అని, అభివృద్ధికి నోచుకోక గ్రామాల కన్నా అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల కోసం కార్పొరేటర్ జంగయ్యను అడిగితే నోటికొచ్చినట్లు తిట్టాడని ఆరోపించారు. నిత్యం వాహనాలు బురదలో దిగబడుతున్నాయని చెప్పారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకో వడం లేదని వాపోయారు.