13-03-2025 12:50:55 AM
ప్రోటోకాల్ పాటించలేదని ‘కొప్పుల’ ఆగ్రహం
ఎల్బీనగర్, మార్చి12: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా మన్సూరాబాద్ డివిజన్‌లో పర్యటించడంపై కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్సూరాబాద్‌లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి తన కార్యాలయంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మునగాల హరీశ్ రెడ్డి, నాయకులు యంజాల జగన్, శ్రీధర్ గౌడ్, కిరణ్ రెడ్డి తదితరులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడాన్ని విమర్శిం చారు. మన్సూరాబాద్ డివిజన్ అభివృద్ధి పనులకు నేను రిప్రజెంటేషన్ ఇచ్చానని, అధికారులు ఎస్టిమేషన్ వేసిన అనంతరం, టెండర్ పూర్తయిన తర్వాత పనులను ప్రారంభించానని వివరిం చారు.
ప్రతి పని పూర్తయ్యే వరకు నీను పర్యవేక్షణ చేస్తే... ఇప్పుడు మీరు వచ్చి ప్రారంభిస్తారా? అని ప్రశ్నించారు. నేను తెచ్చిన పనులకు మీరు టెంకాయలు కొట్టడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. కాలనీవాసులు, అధికారులు, పత్రిక మిత్రులను తప్పుదోవ పట్టించే తప్పుడు రాజ కీయాలు మానుకోవాలని సూచించారు. మీకు ప్రజలు ఏ విధంగా ఓట్లు వేసి గెలిపించారో... నన్ను కూడా అదే విధంగా ఓట్లేసి గెలిపించారన్నారన్నారు. మీరు ఎంత ప్రతిపక్షంలో ఉన్నారో... నేను అంతే ప్రతిపక్షంలో ఉన్నానని... మీరు మాకు ఎంత గౌరవం ఇస్తే మీకు అంతే గౌరవం ఇస్తామని తెలిపారు.