19-02-2025 09:01:03 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో గల గౌలిగూడ చౌరస్తాలో బుధవారం చత్రపతి మహారాజ్ శివాజీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలేక్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాయకులు జంగం గంగాధర్, నార్ల రవీందర్, ఎజాస్, ప్రదీప్ పటేల్, బోడ భాస్కర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.