- కార్యాలయాల పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం
- మొదటి దశలో నాలుగు జిల్లాల్లో నిర్మాణాలు
- ప్రజలకు మరింత మెరుగైన సేవలకు అవకాశం
- గచ్చిబౌలిలో మాడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం
- రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ప్రజలకు మరింత సమర్థంగా, పారదర్శకంగా సేవలను అందించడానికి సబ్- కార్యాలయాలను పునర్ వ్యవస్థీకరించడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించబో తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
మంగళవారం సచివాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో కలిసి రంగారెడ్డి, హైదరా బాద్, మేడ్చల్ -మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు, వసతులు కల్పించడమే లక్ష్యంగా సబ్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ ఉండాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు గంటల తరబడి చెట్ల కింద వేచి చూసే పరిస్థితి తొలిగిపోవాలని, ఇందుకోసం అవసరమైన భూములను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశిం చారు.
ప్రస్తుతం రాష్ర్టంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలు ఉండగా, వాటిలో 37 మాత్రమే సొంత భవనాల్లో ఉన్నాయని చెప్పారు. మొదటి దశలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్ చెరువు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రంగారెడ్డి జిల్లాకు సంబం ధించి కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీలో, గండిపేట, శేరిలింగంపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం, మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మిస్తున్నామని తెలి పారు. ఈ నెలలోనే దీనికి శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మాడల్‌గా గచ్చిబౌలి ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం
గచ్చిబౌలిలోని ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మాడల్ గా ఉంటుందని పొంగులేటి తెలిపారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి బంజారాహిల్స్, ఎస్‌ఆర్‌నగర్, గోల్కొండ మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను షేక్‌పేట్ ప్రాంతంలో ఒకేచోట నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొ న్నారు.
మొదటి దశలో నిర్మించే సబ్-రిజి స్ట్రార్ కార్యాలయాలు కనీసం మూడు ఎకరాల్లో ఉంటాయని, పది నుండి పదిహేను వేల స్క్వేర్ ఫీట్లలో భవన నిర్మాణం ఉంటుందని వెల్లడించారు. వెయిటింగ్ హాలు, తాగు నీటి సదుపాయం, విశాలమైన పార్కింగ్ వంటి వసతులు ఉండేలా డిజైన్ రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఇంటి గ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడటమే కాకుండా పర్యవేక్షణ సులభమవుతుందని అన్నారు. అవినీతిని కూడా తగ్గించవచ్చని, కార్యాలయాల మధ్య పనిభారం సమానంగా ఉండటంతోపాటు దస్త్రాల ప్రాసెసింగ్ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.
సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని అధికారు లకు సూచించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను తక్షణమే రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.