calender_icon.png 1 April, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు కార్పొరేట్ వైద్యం

30-03-2025 08:47:52 PM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు షబ్బీర్ అలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఉద్దేశంతోనే సీఎం రిలీఫ్ ఫండ్ సౌకర్యం అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన స్వగృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన మధుసూదన్ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కును 2లక్షల రూపాయలు లబ్దిదారునికి పంపిణి చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కామారెడ్డి నియోజకవర్గంలోనీ బిక్నూర్ మండలం రామేశ్వరం పల్లి గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డికి సీఎం సహాయనిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు.

పేద ప్రజలు అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల మంచిని మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీ చేసి చూపించామని అన్నారు. రైతు భరోసా అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్  అందిస్తున్నామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.