calender_icon.png 10 January, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ

10-01-2025 01:44:50 AM

  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

రాష్ర్టంలోనే ప్రప్రథమంగా జిల్లాలో ఆన్లున్ ఎడ్యుకేషన్ ప్రారంభం

సిరిసిల్ల, జనవరి 9 (విజయ క్రాంతి): ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించామని వేము లవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ర్టంలోనే ప్రప్రథ మంగా జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కెజిబివి)లలో ఐఐటి, జేఈ ఈ, నీట్ ఆన్లున్ ఎడ్యుకేషన్‌ను రాజన్న సిరిసి ల్ల జిల్లాలోని రుద్రంగి, చందుర్తి, వేముల వాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి కెజి బివిల్లో విద్యార్థినులకు ఐఐటి, జేఈఈ,నీట్ ఆన్లున్ ఎడ్యుకేషన్ ను ఆయన కలెక్టర్ సందీ ప్ కుమర్ ఝాతో కలిసి గురువారం లాంఛ నంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ర్టంలో ఎక్కడ లేని విధంగా రాజాన్న సిరిసిల్ల జిల్లా లోని 13 కెజిబివి లలో అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఐఐటి, జేఈఈ,నీట్,యూజి ఫౌండేషన్ కోర్సులను ఆన్లున్ కోచింగ్ , లైవ్ క్లాసెస్ చెప్పి, విద్యార్థులకు ఏమైనా సందేహా లు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అవకా శం, వారంతరాల్లో టెస్టులు నిర్వహిస్తారని వివరించారు.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేజీబీవి లలో ఆన్లున్ క్లాసులు ప్రారంభించడం అభినందనీ యమని కొనియాడారు. డిల్లీ, హైద్రాబాద్, రాజస్థాన్, కోట లలో ఇచ్చే కోచింగ్ అన్ అకాడమీ సౌజన్యంతో ముందుకు పోతున్నా రనీ తెలిపారు. కోచింగ్ సద్వినియోగం చేసుకొని ఐఐటి, జేఈఈనీట్ లలో సీట్లు సాధించాలనీ ఆకాంక్షించారు.డైట్ చార్జీలు 40 శాతం  కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచారని గుర్తు చేశారు.

రాష్ర్టంలోనే విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టిక ఆహారం అందించ డానికి ఓకే మెను తయారుచేసి అందిస్తున్నా మని వివరించారు.10వ తరగతిలో 10/10 జి.పి.ఏ సాధిస్తే స్వయానా వచ్చి సన్మానం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఐఐటి, జేఈఈ,నీట్ యు.జి. ఫౌండేషన్ కోర్సులను జిల్లాలోని కేజీబీవీపీలలో అందించడం జరుగుతుందన్నారు.

కార్పొరే ట్ పాఠశాలలు, కళాశాల ల్లో ఇచ్చే కోచింగ్ ప్రభుత్వ సహాయంతో కేజీబీవి లో అందిస్తు న్నామన్నారు. తాను మధ్యతరగతి కుటుం బం నుండి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. ఈ కోర్సుల వలన మధ్యతరగతి కుటుంబా లలోని విద్యార్థులకు ప్రవేట్ పాఠశాలలో కోచింగ్ సెంటర్లలో లభించే కోచింగ్ కేజీబీవీ లలో లభిస్తుందని, వారు అనుకున్న లక్ష్యా లు చేరుకునే మంచి అవకాశం ఉందని తెలిపారు.

దేశంలోనే ఉత్తమ సంస్థల్లో అందించే కోచింగ్ ను ఇక్కడ అందుబా టులో ఉంచుతామని వెల్లడించారు. ఇక్కడ జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, రుద్రంగి, వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు చేలకల తిరుపతి, రోండి రాజు, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, ఆయా పాఠశాలల ప్రిన్సిపల్, సిబ్బంది ఉన్నారు.