10-03-2025 08:41:48 PM
ఎల్బీనగర్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్ చైర్మన్ గా జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పిస్తానని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులుగా ఎం.నర్సింరెడ్డి, సాయినాథ్, కొప్పుల ఉపేందర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మోహన్ రెడ్డి, సత్తయ్య, డిఎస్ రామరావు, ప్రదీప్ కుమార్. కే జగన్ మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బి.రత్నాచారిని ఎన్నుకున్నారు.