calender_icon.png 25 April, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ జిఎం సుబ్బారావు సేవలు మరువలేనివి

24-04-2025 08:56:05 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో సుదీర్ఘకాలం సేవలందించిన కార్పొరేట్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ జిఎం మల్లెల సుబ్బారావు అందించిన సేవలు మరువలేనివని ఏరియా సింగరేణి  జనరల్ మేనేజర్ జి దేవేందర్ కొనియాడారు. ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందబోతున్న కార్పొరేట్ జిఎం (ఎంపీ) సుబ్బారావు గురువారం ఏరియాలో పర్యటించగా, ఏరియా జిఎం కార్యాలయంలో ఆయనను ఏరియా జిఎం జి దేవేందర్, ఏరియా ఉన్నత అధికారులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయనకు శాలువతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను, మొక్కను అందజేశారు. అనంతరం ఏరియా జిఎం జి దేవేందర్ మాట్లాడుతూ... ప్రతి ఒక్క ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని తెలిపారు. పదవి విరమణ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ జిఎం సుబ్బారావు సింగరేణికి 42 సంవత్సరాల సుదీర్ఘకాలం సేవలందించారని, ఆయన సింగరేణిలోని అన్ని ఏరియాలలో చాలా అనుభవం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏరియా రక్షణాధికారి ఎం రవీందర్, ఐఇడి డిజిఎం రాజన్న, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏరియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.