calender_icon.png 24 October, 2024 | 5:46 PM

ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్య

12-09-2024 12:31:55 AM

  1. విద్యపై ఖర్చు దేశ భవిష్యత్తుకు పెట్టుబడి
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాం తి): ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి అ త్యున్నత విద్యను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, స్కిల్ యూనివ ర్సిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని  ఆయన తెలిపారు. బుధవారం సచివా లయంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించి వాటి భవన నమూనాలను పరిశీలిం చారు.

ప్రతి నియోజకవర్గం లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థల సేకరణపై ఆరా తీశారు. విద్యతోనే జీవన ప్రమాణాలు పెరుగుతాయని, విద్యపై పెట్టే ఖర్చు రాష్ర్ట, దేశ భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడిగా భావించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిప ల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి, ట్రైబల్ వెల్ఫే ర్ కమిషనర్ డాక్టర్ శరత్, గురుకులం సెక్రెటరీ సైదులు, సీతాలక్ష్మి  పాల్గొన్నారు.