- ఎన్నేళ్లునా వదలని మహమ్మారి
వెలుగులోకి కొత్త వేరియంట్లు
FLiRT వేరియంట్‌తో భయాందోళనలు
న్యూఢిల్లీ, జూలై 11: ‘కరోనా’ ఈ పేరు వింటేనే చాలు.. జనాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నాలుగేళ్ల కింద వెలుగులోకి వచ్చిన కరోనా మన జీవితాలను అతలాకుతలం చేసింది. టీకా టీకా కనుగొన్నా ఈ మహమ్మారి అంతకాకుండా కొత్త రూపాల్లో విజృంభిస్తోంది. శాస్త్రవేత్తలు శ్రమించి ఆవిష్కరించిన వ్యాక్సిన్‌ను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వాలు ప్రజలకు పంపిణీ చేశాయి. అయినా కానీ కరోనా భయం మాత్రం పోలేదు. అనేక కొత్త రూపాల్లో కరోనా పంజా విసురుతూనే ఉంది.
అసలేంటీ FLiRT..
పలికేందుకు కూడా నోరు తిరగకుండా ఉన్న ఈ పదం కరోనా వేరియంట్‌దే. దీన్ని కేపీ2 అని కూడా పిలుస్తారు. అమెరికా, యూకే, సౌత్ కొరియాల్లో ఈ వేరియంట్ పంజా విసిరింది. అక్కడ కేసులు విపరీతంగా పెగుతున్నాయి. పోయిన ఏడాది నవంబర్ నుంచి ఇండియాలో ఉనికిలోకి వచ్చింది. ఈ వేరియంట్‌కు చెందిన 250 సబ్ వేరియంట్లను గుర్తించారు.
వ్యాక్సిన్ల ప్రభావం ఎంత??
మన దేశంతో పాటు ప్రపంచంలో అనేక మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మన దేశంలో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, బూస్టర్ డోస్ అంటూ మూడు సార్లు తీసుకున్నారు. అందుకే చాలా రకాల వేరియంట్లు వచ్చినా జనా లు తట్టుకుంటున్నారు. ఈ వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని పెంచడమే ఇందుకు కారణం.
ఈ జాగ్రత్తలు అవసరం..
కరోనా వేరియంట్ల నుంచి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత పాటించడం వల్ల కరోనా వేరియంట్లకు దూరంగా ఉండవచ్చు.
అంత ప్రమాదమా..
FLiRT వేరియంట్ సోకితే ఎంత ప్రమాదం ఉంటుందని అంతా ఆందోళన చెందుతున్నారు. దీనిపై డాక్టర్ ఆరోన్ గ్లాట్ స్పందిస్తూ.. ఈ వేరియంట్ వల్ల ఆసుపత్రుల పాలయిన జనాలు ఎక్కువగా లేరని తెలిపారు. చాలా మంది ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి వారిలో పెరిగింది కావున అంత ప్రమాదం లేదని వెల్లడించారు.
అసలేంటీ దీని లక్షణాలు?
ఏ వేరియంట్ కరోనా సోకినా కానీ లక్షణాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. వాంతులు కావడం, తలతిరగడం వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. ఈ వే రియంట్ సోకినా కానీ మామూలు కరోనా వేరియంట్స్ సోకినపుడు కనిపించే లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు వెల్లడించారు.