27-04-2025 06:42:31 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమాన్ని, హనుమంతుడి ఆలయాలను ఆదివారం కరోనా వ్యాక్సిన్ తయారీకి కష్టపడ్డా సఫల ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్(Sapala Organics Private Limited) ఉద్యోగులు దర్శించుకున్నారు. వీరిని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తాడ్వాయి మండలానికి ఆహ్వానించి ఆలయాలను దగ్గరుండి అలాగే నీరు లేని ప్రాంతాలలో వ్యవసాయం చేయడం ఎలానో పరిశోధన చేసి చూపించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ... ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తలు కామారెడ్డి జిల్లాకు రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. తదనంతరం వారికి విందు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం వారు పైడి ఎల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.