29-03-2025 12:00:00 AM
ఖమ్మం, మార్చి 28 (విజయక్రాంతి ):-రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవటం వలన దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నా రని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మద్దతు ధరలు 2225 రూ.లు క్వింటాల్కు ప్రభుత్వం నిర్ణయించగా, 2000 రూ.లకే దళారులు కొంటున్నారని అన్నారు.మద్దతు ధరలకు ప్రభుత్వం కొనుగోళ్ళు ప్రారంభించాలన్నారు. ఖమ్మం జిల్లాలో సుమారు లక్షా యాభైవేల ఎకరాలలో పంట వేశారని, సుమారు 50 కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలన్నారు. మద్దతు ధరలు శాస్త్రీయంగా లేవన్నారు.
దిగుబడి ఖర్చులు పెరిగిపోయినా దానికి తగిన విధంగా మద్దతు ధరలు పెంచడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఎం.ఎస్.పి. బోర్డులో రైతు ప్రతినిధులు లేకపోవటమే కారణమన్నారు. ఇప్పటికైనా మద్దతు ధరలు సవరించి కనీసం 2500 రూ.లు ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు గతంలో హామీ యిచ్చినట్లు బోనస్ ప్రకటించాలన్నారు.