ఆందోళన చెందుతున్న రైతులు
కామారెడ్డి, జనవరి 1౩ (విజయక్రాంతి): మొక్కజొన్న పంటకు అగ్గి తెగుళ్లు సోకి పంట కుంగిపోతున్నది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో రబీ సీజన్‌లో మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు. బోరు మోటార్ బావుల కింద వేసిన మొక్కజొన్నకు అగ్గి తెగుళ్లు సోకడంతో పంట కుంగి పోతున్నది.
మందులు వాడిన కూడా తగ్గ డం లేదని రైతులు వాపోతున్నారు. తాడ్వా యి మండలం నందివాడ గ్రామంలో రాజేందర్‌రావు అనే రైతు 8 ఎకరాల్లో మొక్కజొన్న పంటను వేశాడు. ఏపుగా పెరిగిన మొక్కజొన్నకు అగ్గి తెగుళ్లు సోకడంతో మందు పిచికా రి చేసినా తగ్గలేదు. రోజురోజుకు అగ్గి తెగుళ్లు తీవ్రత పెరుగుతుందని వాపోయారు.
వ్యవసాయ అధికారులకు తెలిపినా మందులు చెబుతున్నారే తప్ప పంటను పరిశీలించడం లేదని రైతులు వాపోతున్నారు. నందివాడ గ్రామంలో ఐదు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా.. అగ్గి తెగుళ్లు సోకుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ గ్రామాల్లో తీవ్రత..
జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగయింది. తాడ్వాయి మండలంలో దేమికలాన్, కన్కల్, ఎర్రపహడ్, ఎండ్రియాల్, కృష్ణాజివాడి, దేవాయి పల్లి, చందాపూర్, బ్రహ్మణ్ లింగంపేట మండలంలోని లింగంపల్లి, ముస్తాపూర్, నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామా ల్లో మొక్కజొన్నకు తెగుళ్లు సోకాయని రైతు లు వాపోతున్నారు. వ్యవసాయధికారులు స్పందించి తెగుళ్లను గుర్తించి అవసరమైన మందులను ఇప్పించాలని కోరుతున్నారు.
తెగుళ్లు పెరుగుతున్నాయి
మొక్కజొన్న పంటకు తెగుళ్లు వచ్చి రోజు రోజుకు పెరుగుతున్నాయి. అధికారులు పంటను పరిశీలించి, తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతాం. పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోతాం.
లలితాబాయి, నందివాడ