09-04-2025 10:35:44 PM
కల్లూరు (విజయక్రాంతి): మండలంలో వాతావరణం మార్పులు చెంది ఈదురు గాలులతో తుఫానుగా మారి మొక్కజొన్న, వరిపోలాలు, మామిడి తోటలలో కొతకి వచ్చిన మామిడి కాయలు రాలిపోవడం,మొక్కజొన్న నేలకోరిగిపోయిందని రైతులు మారబోయిన శ్రీను ఆవేదన వ్యక్తం చేసారు. అరుగాలాలు కష్టపడి సాగు చేసి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది అని అయన తెలిపారు. అలాగే రైతుల పైన భారం పడకుండా ప్రభుత్వం, అధికారులు స్పందించి పంటలకు నష్టపరిహారం అందించి రైతులు అప్పుల ఊబీలో కురుకొని పోకుండా మొక్కజొన్న, మామిడి రైతులను ఆదుకోవాలని అయన కోరినారు.