calender_icon.png 12 February, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణకే కార్డెన్ సర్చ్

10-02-2025 05:54:26 PM

సీఐ రవీందర్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. సోమవారం ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని ఆర్ఆర్ కాలనీలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. తనిఖీలలో సరేనా పత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, ఒక కారును గుర్తించి పోలీస్ స్టేషన్ తరలించారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ తెలిపారు. తనిఖీలలో సీఐతో పాటు నలుగురు ఎస్ఐలు, 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.