calender_icon.png 3 April, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాలలో కార్డెన్ సెర్చ్..

01-04-2025 11:45:56 PM

పాల్గొన్న రామగుండం సీపీ, మంచిర్యాల డిసిపీ, ఏసిపి..

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ లో మంగళవారం రాత్రి 10.30 గంటలకు డిసిపి ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తిలక్ నగర్ లోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఇండ్లు, ఇంటి పరిసరాలతో పాటు వాహనాలను పరిశీలించారు. వాహనాలకు ఆర్సి, తదితర సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా  కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా ఉన్న ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. కాలనీవాసులను భద్రత పరమైన విషయాలపై అడిగి తెలుసుకున్నారు. పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం కాలనీలోని యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని, సరైన ధ్రువీకరణ పత్రాలతో వాహనాలను నడపాలని, కాలనీకి అనుమానాస్పదంగా ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీస్ సిబ్బంది టీ కార్డెన్ సెర్చ్ లో మంచిర్యాల ఏసిపి ప్రకాష్, సీఐలు ప్రమోద్ రావు(మంచిర్యాల టౌన్), ఆకుల అశోక్ (మంచిర్యాల రూరల్), నరేందర్ (లక్షెట్టిపేట), వేణు చందర్ (శ్రీరాంపూర్), ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.