25-04-2025 10:07:04 PM
చెన్నూర్ (విజయక్రాంతి): చెన్నూరు సిఐ దేవేందర్ ఆధ్వర్యంలో మండలంలోని లంబడిపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో బెల్లం పానకం ద్వoసం చేసి, గుడుంబా, బెల్లం స్వాధీనం చేసుకొన్నారు. అలాగే సరైన ధ్రువపత్రాలు లేని 50 బైకులు సీజ్ చేశారు. అనంతరం సిఐ దేవేందర్ మాట్లాడుతూ... యువత ఆన్లైన్ మోసాలకు, ఆన్లైన్ గేమ్స్, మత్తు పదర్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సుబ్బారావు, వెంకటేశ్వర రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.