calender_icon.png 18 March, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూరుగుగూడెంలో కార్డెన్ సర్చ్

17-03-2025 07:20:04 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని బూరుగు గూడెం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామ కూడలిలో ఎస్సై మాట్లాడుతూ... కొత్త వారిని గానీ, అనుమానాస్పద వ్యక్తులను గోదావరి దాటించవద్దని, కొత్త వారి సమాచారం తప్పకుండా పోలీసులకు అందించాలని సూచించారు. అలాగే మావోయిస్టుల దుశ్చర్యల గురించి వివరిస్తూ వారికి సహాయం చేయడం ఆశ్రయం ఇవ్వడం చట్టరీత్య నేరం అని, చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీస్ లకి సమాచారం అందించాలని తెలిపారు. గుడుంబాకు, గుట్కాలకు బానిస అయ్యి జీవితాలను నాశనం చేసుకోవద్దు అని, గుడుంబా అమ్మిన తయారు చేసిన సరఫరా చేసినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.