calender_icon.png 25 March, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

జిల్లా కేంద్రంలో కార్డెన్ అండ్ సెర్చ్

24-03-2025 12:03:40 AM

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపైన  చర్యలు తప్పవు

కాలనీలలో  కొత్త వ్యక్తుల కదలికను పోలీసులకు సమాచారం ఇవ్వాలి

డీఎస్పీ వెంకటేశ్వరావు 

వనపర్తి టౌన్, మార్చి 23 :  నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని డిఎస్పీ వెంకటేశ్వరావు అన్నారు.  జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు ఆదివారం పోలీస్ సిబ్బంది తో కలిసి జిల్లా కేంద్రం లోని రాంనగర్ కాలనీ లో కార్డెన్ సర్చ్ కార్యక్రమం ను నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఇద్దరు సి ఐ లు, 12 మంది ఎస్ ఐ లు, 88 మంది సిబ్బంది తో కలిసి కార్డెన్ సర్చ్ కార్యక్రమం ను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా ల మరియు గుడుంబా తయారీ, గంజాయిని విక్రహిచడం, పీడీస్ రైస్ అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

గుడుంబా, గుట్కా, గంజాయి లాంటి అక్రమ వ్యాపారం, చట్ట వ్యతిరేకమైన కార్యాకలాపాలకు పాల్పడకూడదన్నారు.వాహనాలు  నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. ఈ కార్డెన్ సర్చ్ కార్యక్రమం లో ఎలాంటి పత్రాలు లేని కారు, 3 ఆటోలు, 62 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో  వనపర్తి సిఐ, ఎం, కృష్ణ, కొత్తకోట సిఐ, రాంబాబువనపర్తి పట్టణ ఎస్త్స్ర ,హరిప్రసాద్,వనపర్తి రూరల్ ఎస్త్స్ర, జలేందర్ రెడ్డి, అన్ని  పోలీస్టేషన్ల ఎస్త్స్రలు, ఏఎస్త్స్రలు, హెడ్ కానిస్టేబుల్, మరియు కానిస్టేబుల్స్, మహిళ కానిస్టేబుళ్లు. హోంగారడ్స్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.