calender_icon.png 24 April, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొంపేడు చెక్ పోస్ట్ చర్చి ఏరియాలో కార్డెన్ అండ్ సెర్చ్

24-04-2025 05:17:16 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణ రొంపేడు చెక్ పోస్ట్ చర్చి ఏరియాలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఇల్లందు డిఎస్పి చంద్రభాను(DSP Chandrabhanu) ఆధ్వర్యంలో గురువారం ఉదయం క్యాషియో కార్డెన్ అండ్ సెర్చ్ పోలీసులు నిర్వహించారు. కార్డెన్ అండ్ సెర్చ్ చేయగా 60 వాహనాలు పట్టుకొని కాగితాలు చెక్ చేయగా ఎటువంటి కాగితాలు లేని 5 ద్విచక్రవాహనాలను ఇల్లందు పోలీస్ స్టేషన్ కి తరలించారు. పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు.

ఇట్టి కార్డెన్ సెర్చ్ కి చర్చ్ రొంపేడు ప్రజలందరితో సమావేశం నిర్వహిచి సైబర్ నేరాలు, మత్తు పదార్థాల గురించి, ట్రాఫిక్ అవేర్నెస్, హెల్మెట్ పెట్టుకో పోవడం వల్ల జరిగే ప్రమాదాల గురించి బండి ఇన్సూరెన్స్ చేయించు కోకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా గుడుంబా వల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మత్తు పదార్థాలను గుర్తించే డాగ్స్ ను కూడా తీసుకొచ్చి ప్రతి కిరణం షాపు, అనుమానస్పద స్థలాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ, ఇల్లందు ఎస్సై సూర్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.