calender_icon.png 26 October, 2024 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 పరీక్షలో కాపీయింగ్!

26-10-2024 12:36:55 AM

  1. గణాంకాలను చేతిపై రాసుకొచ్చిన అభ్యర్థిని
  2. ఆన్సర్ షీట్‌లోని రఫ్ పేపర్లపై రాస్తుండగా గుర్తించిన ఇన్విజిలేటర్లు
  3. కేంద్రం వద్ద తనిఖీల్లో గుర్తించని పోలీసులు, సిబ్బంది
  4. ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ సెంటర్‌లో ఘటన

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ ఘటన చోటు చేసుకుంది. అధికారులు ఎన్ని జాగ్రత్తులు తీసుకుంటున్నా కాపీయింగ్ ఘటన వెలుగులోకి రావడంతో టీజీపీఎస్సీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో భా గంగా శుక్రవారం ఎకనామీ అండ్ డెలప్‌మెంట్ పరీక్షను నిర్వహించారు.

ఇబ్రహీపట్నంలోని సీవీఆర్ కాలేజీలో మహబూబ్‌నగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళా అభ్యర్థి పరీక్షకు హాజరైంది. ఆమె కొన్ని గణాంకాలను తన చేతిపై రాసుకొని పరీక్షకు రాగా తనిఖీ సందర్భంగా పోలీసులు, సిబ్బంది గుర్తించలేదు. దీంతో లక్ష్మీని పరీక్షకు అనుమతించారు. పరీక్షా హాల్లోకి తొలుత అభ్యర్థులకు ఆన్సర్లు షీట్లను అందజేశారు.

ఆన్సర్‌షీట్‌లోని రఫ్‌షీట్స్‌లో లక్ష్మీరాయడం ప్రారంభించింది. ప్రశ్నపత్రం ఇవ్వకముందే రాయడాన్ని గమనించిన ఇ న్విజిలెటర్లు తనిఖీ చేయగా, చేతిపై ఆన్సర్లు రాసుకొచ్చినట్లు గుర్తించారు. ఆమెను పరీక్షాహాల్ నుం చి బయటికి తీసుకొచ్చి డిబార్ చేశారు.

ఇదంతా ప్రశ్నపత్రం ఇవ్వకముందే, హాల్లోకి అనుమతించిన 10 నిమిషాల్లోనే జరిగిందని, ఇక నుంచి జర గబోయే పరీక్షల నుంచి సదరు అభ్యర్థిని డిబార్ చేసినట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే లక్ష్మీ ఎస్జీటీ టీచర్‌గా మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.

క్వశ్చన్ పేపర్‌పై సీల్ లేదు: బీఆర్‌ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి

గ్రూప్--1 మెయిన్స్ ఎగ్జామ్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయని బీఆర్‌ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. క్వశ్చన్ పేపర్‌పై సీల్ లేకపోవడంపై అనుమానాలున్నాయని ఎక్స్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీల్ ఉన్న, సీల్‌లేని ప్రశ్నాపత్రాలను ఎక్స్‌లో పోస్ట్ చేశా రు.

సైనిక్‌పురి డిఫెన్స్‌కాలనీ భవన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయం పరీక్షాకేంద్రంలో అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నాపత్రంపై సీల్ లేకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశా రు. అభ్యర్థుల ఒత్తిడితో మేడ్చల్ జిల్లా కలెక్టర్, టీపీజీఎస్సీకి నిర్వహకులు లేఖరా సినట్లు తెలిసిందన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.